‘హరి హర వీరమల్లు’.. చుట్టేయకుండా ఉంటే చాలు

‘హరి హర వీరమల్లు’.. చుట్టేయకుండా ఉంటే చాలు

Published on Mar 11, 2021 7:28 PM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 27వ సినిమాను క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రంతో పాటు ఈ సినిమా కూడ చేస్తున్నారు పవన్. ఈ సాయంత్రమే సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. మొదటిసారి పవన్ హిస్టారికల్ మూవీ చేస్తుండటంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం చాలా పవన్ లుక్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఫెరోషియస్ లుక్లో హరి హర వీరమల్లుగా పవన్ చాలా బాగా సెట్టయ్యారు. లుక్ చూసిన అభిమానులు సినిమా గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు. క్రిష్ దర్శకుడిగా తన సమర్థతను ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. ఆయన కెరీర్లో మంచి మంచి సినిమాలున్నాయి. కానీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని గుర్తుచేసుకుంటున్నారు అంతా. ఆ సినిమా ఆరంభంలో చాలా బాగానే ఉన్నా ముగింపు దశకు వచ్చేసరికి హడావుడిగా చుట్టేశారనే విమర్శ ఉంది. అది పవన్ సినిమాలో రిపీట్ కాకూడదని కోరుకుంటున్నారు అభిమానులు. టైమ్ తక్కువగా ఉందని, పవన్ డేట్స్ కొన్నే ఉన్నాయని సినిమాను హడావుడిగా చేయకుండా అన్ని విధాలా సంతృప్తిగా ఉండేలా తీస్తే తప్పకుండా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు