
బాహుబలి కంటే ముందే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ చిత్రం అనంతరం ప్రభాస్ కు ఖండాంతరాలు దాటి ఇప్పటికీ పదిలంగానే ఉంది. అలాగే జాతీయ స్థాయిలో ఇప్పుడు బారె క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ ఫాలోయింగ్ ఒక్క ఆఫ్ లైన్ లోనే కాకుండా ఆన్ లైన్ లో కూడా ఒక రేంజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా అయితే పేస్ బుక్ లో ప్రభాస్ కు రికార్డు స్థాయి ఫాలోవర్స్ ఉన్నారు. మిలియన్స్ కొద్దీ ఫాలోవర్స్ ను ప్రభాస్ సొంతం చేసుకుంటున్నాడు. మరి ఇప్పుడు లేటెస్ట్ గా తన పేస్ బుక్ ఫాలోవర్స్ కౌంట్ ను 22 మిలియన్ మార్క్ ను అందుకొని ఇంకో ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ రికార్డును సెట్ చేసాడు. మరి ఇప్పుడు ప్రభాస్ చేసిన “రాధే శ్యామ్” రిలీజ్ కు రెడీ అవ్వగా “సలార్” మరియు “ఆదిపురుష్” అనే మరో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

