
మన టాలీవుడ్ లెజెండర్య్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు “ఆచార్య”లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందు “సైరా నరసింహా రెడ్డి” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రంలో మరో మెగాస్టార్ అదే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో అప్పట్లో ఈ కాంబోపై మంచి హై నడిచింది.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వినిపిస్తుంది. అప్పుడు చిరు కోసం అమితాబ్ రాగా ఇప్పుడు అమితాబ్ కోసం చిరు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమితాబ్ బాలీవుడ్ లో చేస్తున్న ఓ సినిమాకు గాను చిరుకి సరిపడా రోల్ డిమాండ్ లో ఉందట దీనితో చిరుని ఆయన అప్రోచ్ కాగా చిరు కూడా అంగీకారం చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి.

