మాస్టర్, ఠాగూర్.. కలిపితే పవన్ కళ్యాణ్

మాస్టర్, ఠాగూర్.. కలిపితే పవన్ కళ్యాణ్

Published on Mar 16, 2021 8:49 PM IST

Pawan Kalyan 1

పవన్ కళ్యాణ్ మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్, హరీష్ శంకర్ కాంబోలో గతంలో ‘గబ్బర్ సింగ్’ లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చి ఉండటంతో వీరి రెండవ సినిమా మీద బిజినెస్ వర్గాల్లో సైతం విపరీతమైన క్రేజ్ నెలకొంది. హరీష్ శంకర్ సినిమా అంటే కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుంది. కాబట్టి ఈ సినిమా కూడ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గానే ఉండనుంది.

ఇక కథ విషయానికొస్తే ఇందులో పవన్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారని చాలా రోజుల నుండి టాక్ నడుస్తోంది. తాజాగా సినిమా గతంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘మాస్టర్, ఠాగూర్’ తరహాలో ఉంటుందట. అంటే కాలేజ్ నేపథ్యంలో, ఒక బలమైన సామాజిక సమస్య నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చట. ఇకపోతే ఇందులో పవన్ సరసన కియరా అద్వానీని కథానాయకిగా తీసుకునే యోచనలో ఉన్నారు మేకర్స్.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం పవన్ చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’, క్రిష్ చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు