నాగార్జునతో కాజల్ మొదటిసారి

నాగార్జునతో కాజల్ మొదటిసారి

Published on Mar 17, 2021 3:00 AM IST

అక్కినేని నాగార్జున ఇటీవలే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గత నెల 22 నుండి మొదలైంది. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం భిన్న భాషలు నుండి నటీనటులను తీసుకుంటున్నారు ప్రవీణ్ సత్తారు. ఇందులో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్, మిస్ యూనివర్స్ పోటీల్లో మెరిసిన‌ గుల్‌పనాగ్‌ నటిస్తోంది.
ఇక నాగార్జునకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్, నాగ్ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ వర్క్ చేసిన ఆమెకు నాగ్ సరసన నటించే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. కాజల్ అగర్వాల్ మార్చి 31 నుండి హైదరాబాద్లో జరగనున్న షూటింగ్లో జాయిన్ కానుంది. నారాయణ దాస్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.

తాజా వార్తలు