మహేష్ బాబు నిర్మాణంలో ‘జాతిరత్నం’

మహేష్ బాబు నిర్మాణంలో ‘జాతిరత్నం’

Published on Mar 19, 2021 12:09 AM IST

Naveen Mahesh

‘జాతిరత్నాలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న ఆయన ‘జాతిరత్నాలు’తో ఇంకో మెట్టు పైకెక్కాడు. ఈ విజయంతో నవీన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలువురు నిర్మాతలు అతనితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఇప్పటికే ఒక సినిమాకు ఒప్పుకుని ఉన్న నవీన్ దిల్ రాజ్ ప్రొడక్షన్లో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సైతం నవీన్ డేట్స్ తీసుకున్నట్టు చెబుతున్నారు.

ఇవన్నీ కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో నవీన్ ఒక సినిమా చేయవచ్చనే టాక్ నడుస్తోంది ఫిల్మ్ నగర్లో. ‘జాతిరత్నాలు’ చూసిన మహేష్ నవీన్ నటనను కొనియాడారు. ‘వన్’ సినిమా టైంలోనే అతనిలో స్పార్క్ ఉందని గ్రహించానని మహేష్ అన్నారు. మొత్తానికి ఒక్క విజయంతో నవీన్ ఫుల్ బిజీ స్టార్ అయిపోయాడు. రానున్న రెండు మూడు నెలల్లో అతను నాలుగైదు సినిమాలకు సైన్ చేసినా ఆశ్చర్యం లేదు. అవి కూడ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండనుండటం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు