‘తలైవి’ కోసం కంగనా ప్రత్యేక డబ్బింగ్ !

‘తలైవి’ కోసం కంగనా ప్రత్యేక డబ్బింగ్ !

Published on Mar 28, 2021 10:07 PM IST

Kangana Ranaut

తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా ఏ.ఎల్ విజయ్ దర్శకత్వంలో వస్తోన్న బయోపిక్ ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది, ఇప్పటికే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా కోసం ‘కంగనా’ బాగా కష్టపడిందట. ముఖ్యంగా ఈ సినిమాలో తన పాత్రకు సంబందించిన డబ్బింగ్ విషయంలో ఆమె ఎంతో ప్రాక్టీస్ చేసి.. జయ యుక్త వయసులో ఉన్నప్పటి పాత్ర కోసం కంగనా ప్రత్యేకంగా ఒక్కో డైలాగ్ నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పిందట.

మొత్తానికి కంగనా ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతుంది. పైగా సినిమాలో మొత్తం ఐదు గెటప్స్ లో కనిపించబోతుందట. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. కాగా ఈ చిత్రం హిందీ మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు