నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో రానున్న సినిమాలో పవర్ ఫుల్ విలన్ ఉంటాడని.. ఆ పాత్రను ఇంకా ఫైనల్ చేయలేదని ఇప్పటికే చాల రూమర్స్ వచ్చాయి. అయితే, ఇంతవరకూ ఈ సినిమాలో నటించే విలన్ ఎవరు అనేది మాత్రం ఇంకా తేలలేదు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బాలయ్యకు విలన్ గా తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ నటించబోతున్నాడని తెలుస్తోంది.
ఈ భారీ యాక్షన్ సినిమాలో సీనియర్ బాలయ్యకు విలన్ పాత్ర ఉందని.. ఈ పాత్రలోనే శరత్ కుమార్ ను తీసుకుంటున్నారని టాక్. అయితే సీనియర్ బాలయ్య క్యారెక్టర్ కేవలం రెండు సీన్స్ లో మాత్రమే ఉంటాడని.. ఆ క్యారెక్టర్ కి విలన్ గా ప్లాష్ బ్యాక్ లో శరత్ కుమార్ కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా వస్తుండంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


