పవన్ ఫ్యాన్స్ చెప్పింది చేసి చూపించారు

పవన్ ఫ్యాన్స్ చెప్పింది చేసి చూపించారు

Published on Mar 31, 2021 12:08 AM IST

pawan 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానుంది. నిన్ననే సినిమా ట్రైలర్ విడుదలైంది. నేరుగా థియేటర్లలో ట్రైలర్ వదిలారు టీమ్. మూడేళ్ళ తరవాత పవన్ వెండి తెర మీద కనిపించడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. థియేటర్లకు జనం పోటెత్తారు. కోవిడ్ లాక్ డౌన్ తరవాత మొదటిసారిగా సినిమా హాళ్లల్లో అసలు సిసలు సినిమా వాతావరణం నెలకొంది. అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కొన్ని చోట్ల థియేటర్లు డ్యామేజ్ కూడ అయ్యాయి.

ఇక సోషల్ మీడియాలో అయితే ఆ డ్యామేజ్ మరీ ఎక్కువగా ఉంది. పాత రికార్డుల్ని తిరగరాయాలని ముందే డిసైడ్ అయ్యారు. 24 గంటల్లో ట్రైలర్ లైక్స్ మిలియన్ మార్క్ క్రాస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. హాఫ్ మిలియన్ లైక్స్ 5 గంటల్లోనే రాబట్టుకున్న ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు 9.87 లక్షల లైక్స్ సాధించింది. ఇక 24 గంటలు పూర్తయ్యేసరికి అనగా సాయంత్రం 6 గంటల్లో మిలియన్ లైక్స్ మార్కును చాలా ఈజీగా అందుకుని టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ టీజర్ ఇన్ 24 అవర్స్ అనే రికార్డును సొంతం చేసుకుంది. మొత్తానికి ట్రైలర్ సినిమా మీదున్న అంచనాలను రెట్టింపు చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు