టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్లలో హరీష్ శంకర్ కూడ ఒకరు. మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడనే పేరుంది ఈయనకు. 2006లో ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయారు. వరుస పరాజయాల్లో ఉన్న పవన్ కు ‘గబ్బర్ సింగ్’ ఎలాంటి ఊపునిచ్చిందో అందరికీ తెలుసు. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది సినిమా. అందుకే పవన్ అభిమానులకు హరీష్ శంకర్ అంటే ఎంతో అభిమానం. పవన్ వద్ద కూడ హరీష్ శంకర్‌కు మంచి పేరుంది.
పవన్ తన 28వ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలోనే చేయనున్నారు. ఆ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. నిజానికి పవన్ ఒప్పుకున్న సినిమాలు అన్నింటిలోకీ హరీష్ శంకర్ సినిమా మీదే ఎక్కువ హైప్ ఉంది. ఎందుకంటే హరీష్ శంకర్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తాడు కాబట్టి. పవన్ ను ఎలా చూపిస్తే అభిమానులు ఇంప్రెస్ అవుతారో అతనికి తెలుసు. అందుకే అతని మీద అంత గురి అభిమానులకు. ఈరోజు హరీష్ శంకర్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా ‘గబ్బర్ సింగ్’కు రెండింతలు ఉండేలా చేయమని విన్నవించుకుంటున్నారు కూడ.


