పవన్ క్రేజీ ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడేనట

పవన్ క్రేజీ ప్రాజెక్ట్ మొదలయ్యేది అప్పుడేనట

Published on Apr 2, 2021 3:00 AM IST

Pawan Kalyan 1

రీఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఇంతకుముందులా ఏడాదికి ఒక సినిమాతో సరిపెడితే కుదరదని రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న విడుదలకానుండగా క్రిష్ సినిమా షూటింగ్ దశలో ఉంది ఇది 2022 సంక్రాంతికి వస్తుంది. అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ఉండొచ్చు. ఇలా రెండు సినిమాలతో పవన్ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

జూన్ నాటికి ఈ సినిమాలు ఒక కొలిక్కి వస్తాయి. పవన్ కొద్దిగా ఫ్రీ అవుతారు. ఆ సమయంలోనే హరీష్ శంకర్ సినిమాను మొదలుపెడతారట ఆయన. జూన్ మొదటి వారంలో సినిమాను లాంఛ్ చేసి రెండవ వారం నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తారట. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. పవన్ చేస్తున్న సినిమాలన్నింటిలోకీ ఇదే పక్కా కమర్షియల్ సినిమా. అందుకే ఫుల్ క్రేజ్ ఉంది అభిమానుల్లో. హరీష్ శంకర్ మరోసారి ‘గబ్బర్ సింగ్’ లాంటి ట్రీట్ ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో పవన్ ప్రొఫెసర్ పాత్రలో కనిపిస్తారని, చిరు చేసిన ‘మాస్టర్, ఠాగూర్’ తరహాలో ఈ సినిమా ఉంటుందనే టాక్ కూడ నడుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు