థియేటర్ల సమస్యల పై మంత్రితో మళ్ళీ చర్చలు !

ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం పై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో తగ్గించిన టికెట్ రేట్ల పై ఇటు సినీ ప్రముఖులు, అటు ఏపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు మధ్య వాదనలు, విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఏపీలో సరైన నిర్వహణ, అనుమతులు లేని థియేటర్‌లపై జగన్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.

దాంతో ఇక తాము థియేటర్‌ లను నడపలేం అంటూ ఇప్పటికే పలువురు యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేసుకుని తదుపరి ప్రణాళికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, పంపిణీదారులు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్‌ రేట్ల తగ్గింపు కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నానికి వివరించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 20మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలిసేందుకు అనుమతి లభించింది.

Exit mobile version