అడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం లో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ 2. ఈ చిత్రం ను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తుండగా, న్యాచురల్ స్టార్ నాని సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమా పై ఆసక్తి నెలకొంది. మొదటి పార్ట్ కంటే కూడా ఈ చిత్రం పై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ హీరోయిన్ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరి ఆర్య పాత్రలో నటిస్తుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 2, 2022 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి గారీ బిహెచ్ ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా, జాన్ స్టీవర్ట్ ఏడురి సంగీతం అందిస్తున్నారు.


