వెరైటీ కామెడీతో ఆకట్టుకోనున్న వెంకటేష్

వెరైటీ కామెడీతో ఆకట్టుకోనున్న వెంకటేష్

Published on Mar 13, 2013 8:33 AM IST

Shadow
విక్టరీ వెంకటేష్ స్టైలిష్ అవతారంలో కనిపించనున్న ‘షాడో’ సినిమా సమ్మర్ ఎంటర్టైనర్ గా మనముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమాలో ఇంకా ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఈ సినిమా లోని కామెడీ ట్రాక్ గురించే చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో డైరెక్టర్ మెహర్ రమేష్ సరికొత్త వెరైటీ కామెడీ కాన్సెప్ట్ తో మనముందుకు రానున్నాడు. ఇందులో వెంకటేష్ తాప్సీని ఎంతో సరదాగా ఆటపట్టించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వెంకటేష్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు