అఖండ 2 ఎఫెక్ట్ : వెబ్ సిరీస్ కూడా వాయిదా..!

అఖండ 2 ఎఫెక్ట్ : వెబ్ సిరీస్ కూడా వాయిదా..!

Published on Dec 11, 2025 9:59 PM IST

3 roses

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అఖండ 2 రిలీజ్ డేట్ మార్పుతో ఆ రోజు రిలీజ్ కావాల్సిన చాలా సినిమాలు రిలీజ్ డేట్‌ను మార్చుకున్నాయి. అయితే ఇది కేవలం థియేట్రికల్ రిలీజ్‌లపైనే ప్రభావం చూపలేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్‌లపై కూడా అఖండ 2 తన ప్రభావం చూపింది. ఈ భారీ చిత్రం రిలీజ్ అవుతుండటంతో అదే రోజున తమ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేయకుండా వాయిదా వేశారు ప్రముఖ నిర్మాత ఎస్‌కెఎన్.

ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సూపర్ సక్సెస్ అయిన ‘3 రోజెస్’కు సీక్వెల్‌గా వస్తున్న ‘3 రోజెస్ సీజన్ 2’ వెబ్ సిరీస్‌ను ముందుగా డిసెంబర్ 12న స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని భావించారు. కానీ, ఆ రోజు అఖండ 2 రిలీజ్ ఉండటంతో తమ వెబ్ సిరీస్ రిలీజ్‌ను ఒక రోజు వాయిదా వేస్తున్నామని నిర్మాత ఎస్‌కెఎన్ తెలిపారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అఖండ 2 రిలీజ్ ఇంకా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు