బుక్ మై షోలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ హవా

బుక్ మై షోలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ హవా

Published on Dec 12, 2025 9:26 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. మంచి హైప్ లో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యి ఫ్యామిలీ ఆడియెన్స్ లో మరింత హైప్ ని సెట్ చేసేలా చేసాయి. ఇక ఈ సినిమా హవా కి నిదర్శనంగా బుక్ మై షోలో మంచి ఇంట్రెస్ట్ లు కూడా నమోదు అవుతున్నాయి.

దీనితో ఈ సినిమా లేటెస్ట్ గా లక్ష ఇంట్రెస్ట్స్ మార్క్ ని దాటింది. దీనితో ఆడియెన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇంకా టీజర్, ట్రైలర్ కంటెంట్ కూడా బయటకి రాకుండానే ఇది అందుకుంది. ఇక రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికి ఈ నెంబర్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు