టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు లైమ్‌లైట్‌లో ఉన్నంత వరకే తమ కెరీర్‌ను రంగులరాట్నంపై ఊరేగిస్తారు. ఒక్కసారి వారు ఫేడవుట్ అయితే, ఇక వారికి సినిమా ఛాన్సులు రావడం గగనం అయిపోయింది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఒకప్పటి స్టార్ హీరోయిన్‌కు ఎదురైంది. దాదాపు దశాబ్దకాలం పాటు టాప్ హీరోయిన్‌గా రాణించి, ఇప్పుడు చేతిలో సినిమాలు లేకపోవడంతో మరో ప్రయత్నంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది ఈ చందమామ.
ఇంతకీ ఆమె ఎవరని అనుకుంటున్నారా.. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత చాలా మంది హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఇక ఆమెకు టాలీవుడ్‌లో సమంత, తమన్నా, అనుష్క వంటి స్టార్ హీరోయిన్లతో పోటీ ఉన్నా, దాన్ని తట్టుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.
అయితే, ఆమెకు కొన్నేళ్లుగా సరైన సినిమా ఛాన్సులు లేవు. దీనికి తోడు పెళ్లి కావడంతో అ అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చేసిన అరకొర సినిమాలు ఆమెకు ఏ మాత్రం ఉపయోగపడలేదు. దీంతో ఇప్పుడు ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అయితే, ఈ పరిణామంతో ఆమె ఇప్పుడు రూటు మార్చి ఓ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతోంది. హిందీలో రూపొందిన ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌ను తెలుగులో రీమేక్ చేసేందుకు జియో హాట్ స్టార్ ప్రయత్నిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో కాజల్ లీడ్ రోల్‌లో నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.


