మెగా ఫ్యాన్స్‌కు నేడు డబుల్ ట్రీట్.. !

మెగా ఫ్యాన్స్‌కు నేడు డబుల్ ట్రీట్.. !

Published on Dec 13, 2025 8:07 AM IST

Mana-shaker-vara-prasad

మెగా ఫ్యాన్స్‌కు నేడు(డిసెంబర్ 13) డబుల్ ట్రీట్ అందనుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కీలక అప్డేట్స్ రావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది. దీంతో అందరూ ఈ ట్రీట్‌ల కోసం ఆసక్తిగా చూస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతి 2026కి విడుదల లక్ష్యంగా రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విడుదల తేదీని సాయంత్రం 5 గంటలకు ఒక గ్రాండ్ ప్రెస్ మీట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే ఈ సినిమాకు తొలి అవుట్‌డోర్ ప్రమోషనల్ ఈవెంట్ కావడం విశేషం.

ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని తొలి పాట ‘డేఖ్‌లేంగే సాలా’ పూర్తి వెర్షన్‌ను సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో విడుదల చేయనున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ కలిసిన ఈ త్రయం నుంచి మరో సెన్సేషన్ వస్తుందన్న అంచనాలు మెగా అభిమానుల్లో భారీగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు