ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ప్రేమంటే’

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ప్రేమంటే’

Published on Dec 14, 2025 1:02 PM IST

Premante 1

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి హీరోగా కయల్ ఆనంది హీరోయిన్ గా దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం “ప్రేమంటే” కూడా ఒకటి. గత నవంబర్ 21న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా కంటెంట్ పరంగా డీసెంట్ టాక్ ని ఆడియెన్స్ నుంచి అందుకుంది. ఇక అలా థియేటర్స్ రన్ తర్వాత ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఎప్పుడు నుంచి స్ట్రీమ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ చేశారు. ఈ డిసెంబర్ 19 నుంచి ఓటిటిలో ప్రేమంటే అందుబాటులో ఉంటుందట. తెలుగు, కన్నడ ఇంకా తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ కామెడీ క్రైమ్ డ్రామాని అప్పుడు మిస్ అయ్యినవారు ఇప్పుడు ఓటిటిలో ఇంకొన్ని రోజుల్లో చూడొచ్చు. ఇక ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా జాన్వీ నారంగ్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు