
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం ది రాజా సాబ్ కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ ఉన్న ఈ క్రేజీ హారర్ కామెడీ సినిమా రిలీజ్ కి దగ్గరకి వస్తుండడంతో ఒకో అప్డేట్ ని కూడా ఇస్తూ వస్తుంది. ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ వదలగా దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అలాగే నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అని చూస్తున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ పై ఒక క్రేజీ అండ్ కలర్ ఫుల్ పోస్టర్ ని డిజైన్ చేసి వదిలి ఇవాళ సాయంత్రమే ప్రోమోని విడుదల చేస్తున్నట్టుగా రంగం సిద్ధం చేశారు. ఈ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి ఈ ప్రోమోని మేకర్స్ వదలనున్నారు. దానితో ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఖరారు కానుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

