ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా..?

ఆంధ్ర కింగ్ తాలూకా’ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజేనా..?

Published on Dec 16, 2025 10:10 AM IST

Andhra King Taluka 2

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన రీసెంట్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కథనం మరియు నటనకు మంచి స్పందన లభించింది. రామ్ పర్ఫార్మె్న్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించగా ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు