‘ధురంధర్’ ఓటీటీ రిలీజ్ డేట్ అదేనా ?

‘ధురంధర్’ ఓటీటీ రిలీజ్ డేట్ అదేనా ?

Published on Dec 22, 2025 10:00 PM IST

Dhurandhar

బాలీవుడ్ సినిమా ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రోజురోజుకూ కొత్త రికార్డులతో దూసుకుపోతోంది. మొత్తానికి ప్రేక్షకులను థియేటర్లకు భారీగా ఆకర్షిస్తోంది. ఈ సినిమా కథ మొత్తం కరాచీ అండర్ వరల్డ్ చుట్టూ తిరుగుతుంది. ఐఎస్ఐ, అండర్ వరల్డ్ మధ్య జరిగే సంఘటనల చుట్టూ ఈ కథ సాగింది. ఐతే, ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో ఉండగానే.. ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిజిటల్ హక్కులను పొందిన నెట్‌ఫ్లిక్స్, జనవరి 30, 2026న ఈ హిట్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనుందని తెలుస్తోంది.

అన్నట్టు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో తెలుగు వెర్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కాగా రణవీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా , అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పోషించిన పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది. ఇంతకీ, ఓటీటీలో ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు