OTT: ‘బాహుబలి’ విషయంలో ఆడియెన్స్ అసహనం.. కారణమిదే!

OTT: ‘బాహుబలి’ విషయంలో ఆడియెన్స్ అసహనం.. కారణమిదే!

Published on Dec 25, 2025 3:31 PM IST

బాహుబలి

ఇండియన్ సినిమా రూపు రేఖలు మార్చేసిన సినిమా “బాహుబలి” (Baahubali). దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ లు ఇద్దరూ ఏ ముహూర్తాన ఈ సినిమాలకి పూనుకున్నారో కానీ ఈ సినిమా దెబ్బతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. భారతీయ సినిమా ఒకటే అని కాకుండా ప్రతీ తెలుగు ప్రేక్షకునికి ఇది తమ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఈ చిత్రం. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదే తెలుగు సినిమా విషయంలో అభిమానులు, ఆడియెన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఓటిటిలో బాహుబలి: ది ఎపిక్ కేవలం హిందీలో అది కూడా ‘ఒరిజినల్’ అంటూ

ఒకరి క్రెడిట్ ని ఇంకొకరు తీసుకుంటే ఎవరికైనా కోపం వస్తుంది మరి. అలాంటిది బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic OTT) తెలుగు సినిమాని నెట్ ఫ్లిక్స్ లో హిందీ ఒరిజినల్ సినిమా అంటూ ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. సరే కేవలం హిందీ హక్కులే వీరి దగ్గర ఉన్నాయి అందుకు అలా చేశారు అనుకున్నా కూడా అసలు తెలుగులో తీసిన సినిమాని తెలుగు ఆడియెన్స్ కోసం ముందు వదలకుండా హిందీలో రిలీజ్ చేసుకుంటే తెలుగు ఆడియెన్స్ గా తామేం కావాలని సోషల్ మీడియాలో కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ కూడా అడుగుతున్నారు.

తెలుగు వెర్షన్ ఈ ఓటిటిలో వచ్చే ఛాన్స్ ఉందా?

గతంలో బాహుబలి 2 సినిమాలని హాట్ స్టార్ ఇప్పుడు జియో హాట్ స్టార్ వారు కొనుగోలు చేశారు. అయితే ఇందులోనే మళ్ళీ బాహుబలి: ది ఎపిక్ (Baahubali The Epic Telugu) తెలుగు, ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కి ఈ సినిమా వచ్చే అవకాశం ఉన్నట్టు ఇప్పుడు కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.

సో దీనిపై ఓ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. కానీ తెలుగులో రిలీజ్ చేయకుండా హిందీలో రిలీజ్ చేయడంపై మాత్రం ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు