చరణ్ ‘పెద్ది’ పై క్రేజీ రూమర్ !

చరణ్ ‘పెద్ది’ పై క్రేజీ రూమర్ !

Published on Jan 4, 2026 7:00 AM IST

పెద్ది

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’(Peddi). ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఐతే, ఈ సినిమా క్లైమాక్స్ పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. క్లైమాక్స్ లో ఓ భారీ ప్రమాదం కారణంగా హీరో పాత్రకి కాళ్ళు పోతాయని.. అయినప్పటికీ రన్నింగ్ లో ఛాంపియన్ అవుతాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.

కాగా, ఇప్ప‌టి వ‌ర‌కూ చరణ్ నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే.. ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని టాక్. బుచ్చిబాబు రాసిన ఈ సినిమా స్క్రిప్ట్ చాలా భిన్న‌మైందట. అన్నట్టు ‘పెద్ది’(Peddi) వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

తాజా వార్తలు