మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ ఈ సాయంత్రం 04:05 గంటలకు విడుదల కానుంది. తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో జరగనున్న ఈ విడుదల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందు, చిత్ర బృందం ఈ ఉదయం తిరుమలను సందర్శించింది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొందారు.
కాగా ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరుకానున్నారు. మరోవైపు ట్రైలర్‌పై అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని ఆ మధ్య చిరు తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.



