నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన సాలిడ్ డివోషనల్ అండ్ యాక్షన్ చిత్రమే అఖండ 2 తాండవం (Akhanda 2). మంచి హైప్ అండ్ అడ్డంకుల నడుమ వచ్చిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ లో డీసెంట్ రన్ ని అందుకుంది. అయితే దీని పొటెన్షియల్ కి తక్కువే కానీ ఫైనల్ గా ఈ సినిమా థియేటర్స్ నుంచి ఓటిటి రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా తాలూకా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు దీనిపై ఫైనల్ గా బిగ్ అప్డేట్ అందించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా ఈ జనవరి 9 నుంచే అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అలాగే కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్, సహా హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా రాబోతుంది. మరి ఓటిటిలో వచ్చాక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు.


