‘పరాశక్తి’లో ఈ యాక్టర్ క్యామియో రోల్.. మామూలుగా ఉండదట..!

‘పరాశక్తి’లో ఈ యాక్టర్ క్యామియో రోల్.. మామూలుగా ఉండదట..!

Published on Jan 8, 2026 2:00 AM IST

Parasakthi

శివకార్తికేయన్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi) సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ కథాంశం కారణంగా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో శివకార్తికేయన్ స్వయంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తన సినిమాలో మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ ఓ క్యామియో పాత్రలో కనిపించనున్నట్లు ఆయన ధృవీకరించారు. అయితే ఆ పాత్రకు సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, పరాశక్తికి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో అభిమానుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.

ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, రవి మోహన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి, అతర్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ బాస్కరన్ నిర్మించిన ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాజకీయ నేపథ్యం, పవర్‌ఫుల్ యాక్టర్స్, బలమైన కథతో పరాశక్తి (Parasakthi) సంక్రాంతి బాక్సాఫీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు