సూర్య-వెంకీ అట్లూరి చిత్రానికి సెన్సేషనల్ ఓటీటీ డీల్..!

సూర్య-వెంకీ అట్లూరి చిత్రానికి సెన్సేషనల్ ఓటీటీ డీల్..!

Published on Jan 16, 2026 1:04 AM IST

Suriya-46

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రాన్ని ‘సూర్య46’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో సూర్య తమిళంతో పాటు తెలుగునాట కూడా సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా భారీ ఓటీటీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు ఏకంగా రూ.85 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకుందట.

దీంతో ఈ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో మమితా బైజు, రవీనా టండన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు