శంకర వరప్రసాద్ గారు జోరు తగ్గించడం లేదు..!

శంకర వరప్రసాద్ గారు జోరు తగ్గించడం లేదు..!

Published on Jan 17, 2026 12:01 AM IST

msg

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకరవర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఫెస్టీవల్ ఫీస్ట్ అందిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ మోత మోగిస్తోంది.

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలో 2.25 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను సాధించి మరో కీలక మైలురాయిని అందుకుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు సాధించడం సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఇక ఈ సినిమా మున్ముందు ఇదే జోరు కొనసాగించడం ఖాయమని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చిరంజీవి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, టైమింగ్‌తో కూడిన కామెడీ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నాయి. నయనతార హీరోయిన్‌గా వెంకటేష్ క్యామియో పాత్రలో నటించిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు