‘పుష్ప-3’పై క్రేజీ న్యూస్.. నిజమేనా..?

‘పుష్ప-3’పై క్రేజీ న్యూస్.. నిజమేనా..?

Published on Jan 18, 2026 2:00 AM IST

Pushpa 3

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలు ఎలాంటి సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ స్టైల్, మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సిరీస్‌తో ఆయన ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగారు.

ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడో భాగం ‘పుష్ప: ది ర్యాంపేజ్’ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ, లోకేష్ కనగరాజ్‌లతో సినిమాల్లో బిజీగా ఉండగా, సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ కారణంగా ‘పుష్ప 3’పై అధికారిక ప్రకటన ఆలస్యమవుతోంది.

కాగా, ఇన్‌సైడ్ టాక్ ప్రకారం ‘పుష్ప: ది ర్యాంపేజ్’ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయట. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఒక ఆఫీస్‌ను లీజ్‌కు తీసుకుని స్క్రిప్ట్ వర్క్, కథా చర్చలు సూపర్ స్పీడ్‌లో జరుగుతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూడో భాగంలో పుష్ప రాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా కైవసం చేసుకుంటాడు, శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు అన్నదే ప్రధానాంశంగా ఉండనుందని సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ తమ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు