ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’!?

ఓటిటి డేట్ ఫిక్స్ చేసుకున్న రోషన్ ‘ఛాంపియన్’!?

Published on Jan 18, 2026 5:00 PM IST

Champion

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో తన లుక్స్ ఇంకా నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక కూడా ఒకడు. రోషన్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి అటెన్షన్ ని తాను అందుకున్నాడు. ఇలా తన నుంచి వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ చిత్రమే ‘ఛాంపియన్'(Champion). మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం డీసెంట్ రన్ ని అయితే కనబరిచింది.

దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమా ఈ జనవరి 23 నుంచి అందుబాటులో ఉంటుంది అని వినిపిస్తుంది. ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ఈ 23 నుంచి వస్తుందట. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా స్వప్న సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు