ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారట. ఈ సెట్ లో రెండు వారాల పాటు ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్ పై యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో తారక్ పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. ఇప్పటికే, పీటర్ హెయిన్ ఈ సీక్వెన్స్ కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాడట. ఈ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ అవుతాయని తెలుస్తోంది. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట.
పైగా ఈ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా చేయాలని ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట. అందుకే, ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు. కాబట్టి, ఇప్పటి వరకూ ప్రశాంత్ నీల్ తీసిన అన్ని సినిమాల్లోకల్లా బెస్ట్ సినిమా ఇదే అవుతుందని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


