గుడ్ న్యూస్ చెప్పిన అట్లీ దంపతులు.. మరోసారి తల్లిదండ్రులు గా మారనున్న స్టార్ కపుల్..!

గుడ్ న్యూస్ చెప్పిన అట్లీ దంపతులు.. మరోసారి తల్లిదండ్రులు గా మారనున్న స్టార్ కపుల్..!

Published on Jan 20, 2026 6:01 PM IST

Atle

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియా మరోసారి తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము మరోసారి పేరెంట్స్‌గా మారుతున్నట్లు వారు ఈ స్వీట్ న్యూస్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఓ బాబుకి తల్లిదండ్రులైన ఈ స్టార్ కపుల్ ఇప్పుడు రెండోసారి తమ ప్రెగ్నెన్సీ న్యూస్‌ను అధికారికంగా షేర్ చేశారు.

తమ కుటుంబంలో మరో కొత్త మెంబర్ రాబోతున్నారని.. దీంతో తమ ఫ్యామిలీ కంప్లీట్ హ్యాపినెస్‌తో నిండనుందని వారు తమ సంతోషాన్ని వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని కొన్ని ఫోటోల ద్వారా ఈ స్టార్ కపుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, అట్లీ ప్రస్తుతం ది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా ‘AA22’ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపొందిస్తున్నారు.

తాజా వార్తలు