పెళ్లి వార్తలపై ఈషా రెబ్బా రెస్పాన్స్.. ఏమందంటే..?

పెళ్లి వార్తలపై ఈషా రెబ్బా రెస్పాన్స్.. ఏమందంటే..?

Published on Jan 26, 2026 11:00 PM IST

Eesha Rebba

టాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, అందాల భామ ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే, గత కొంతకాలంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా మధ్య ఏదో నడుస్తోందని, వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ వార్తలపై ఈషా రెబ్బా స్పందిస్తూ.. ఆ రూమర్లను తాను విన్నానని, దీనిపై గతంలోనే ఒక క్రేజీ క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్ కూడా చేశానని సరదాగా చెప్పుకొచ్చారు.

తన వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. “మన నియంత్రణలో లేని విషయాలను మనం ఎప్పటికీ ప్లాన్ చేయలేం. సరైన సమయంలో సరైనవి జరుగుతాయని నేను నమ్ముతాను” అని ఈషా అన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వదలచుకోలేదని, ఒకవేళ తన జీవితంలో ఏదైనా ముఖ్యమైన విషయం జరిగితే తానే స్వయంగా ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

తాజా వార్తలు