జయంత్ సి పరాన్జి చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ సాంగ్ రిలీజ్

జయంత్ సి పరాన్జి చేతుల మీదుగా ‘బరాబర్ ప్రేమిస్తా’ సాంగ్ రిలీజ్

Published on Jan 27, 2026 8:00 AM IST

Barabar-Premista

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ సినిమా నుంచి ‘మళ్లీ మళ్లీ’ అనే రొమాంటిక్ మెలోడీ పాటను తాజాగా ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి చేతుల మీదుగా విడుదల చేశారు. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం, సాహిత్యం అందించగా… మహమ్మద్ ఇర్ఫాన్ ఆలపించిన ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. లిరికల్ వీడియోలో హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. పాటను విడుదల చేసిన అనంతరం జయంత్ సి పరాన్జి మాట్లాడుతూ, ట్యూన్ చాలా బాగుందని ప్రశంసించారు. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న ఈ సినిమా విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు యువత నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో అర్జున్ మహీ విలన్‌గా నటిస్తుండగా.. వైఆర్ శేఖర్ సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు