హాస్యనటుడు బ్రహ్మానందం ఆదివారం తన 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఘనంగా సన్మాన వేడుక ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. “బ్రహ్మానందంలో నేను కమెడియన్‌ను చూడలేదు… గొప్ప నటుడిని మాత్రమే చూశా. ఆయన్ని నిత్యం తలచుకోని తెలుగు వాడు ఉండడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ’42 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను.
నేను ఇంతకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగగలిగానంటే అది నా గొప్పతనం కాదు… ప్రేక్షకులది’ అని ఆయన తెలిపారు. అలాగే, తన సినీ ప్రయాణానికి కారణమైన వ్యక్తి దర్శకుడు జంధ్యాల అని, అలాగే తాను ఎదగడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని, నిర్మాత డి. రామానాయుడికి అని, వారందరికీ నా కృతజ్ఞతలు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ శ్రీరామ్, బాబు మోహన్, ఉత్తేజ్, రఘుబాబు, పృథ్వీరాజ్, రచ్చ రవి, సంపూర్ణేశ్ బాబు, ప్రగతి తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


