కశ్మీర్లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘వింటర్’. క్రిసెంట్ సినిమా, టీఎస్ఆర్ మేకర్స్ పతాకాలపై రియాజ్ అహ్మద్, టి. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి. గతంలో ‘రాచరికం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సురేష్ లంకలపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో రామ్, ఆదిత్య సూరజ్ సింగ్, కుసుమ చందక, శశికళ, శ్రీజిత ఘోష్ కీలక పాత్రలు పోషిస్తుండగా, రిజ్వాన్ అలీ విలన్గా వెండితెరకు పరిచయం అవుతున్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. కథ, కథనంతో పాటు దర్శకత్వ బాధ్యతలను సురేష్ లంకలపల్లి చేపట్టిన ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను, ఇతర తారాగణాన్ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం తెలిపింది.


