బాలయ్య కోసం ఆ డైరెక్టర్.. క్రేజీ కాంబో సెట్ అయ్యేనా..?

బాలయ్య కోసం ఆ డైరెక్టర్.. క్రేజీ కాంబో సెట్ అయ్యేనా..?

Published on Feb 2, 2026 8:00 PM IST

Balakrishna

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ రీసెంట్ చిత్రం ‘అఖండ 2’ బాక్సాఫీస్ దగ్గర మిక్సిడ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. NBK111 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటించనుంది. అయితే, ఈ సినిమా తర్వాత బాలయ్య నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారట.

మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మార్కో’ను డైరెక్ట్ చేసిన హనీఫ్ అడేని బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మార్కో వంటి స్టైలిష్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన బాలయ్య కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా వస్తుందా.. అది బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు