ఓటీటీలోనూ అదరగొడుతున్న శర్వానంద్.. ప్రైమ్ వీడియోలో ‘నారీ నారీ నడుమ మురారి’ హవా!

ఓటీటీలోనూ అదరగొడుతున్న శర్వానంద్.. ప్రైమ్ వీడియోలో ‘నారీ నారీ నడుమ మురారి’ హవా!

Published on Feb 5, 2026 9:00 PM IST

Nari Nari Naduma Murari

చార్మింగ్ స్టార్ శర్వానంద్ రీసెంట్ రోమ్-కామ్ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి'(Nari Nari Naduma Murari) బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేయగా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా అందులోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్‌ను ముగించుకున్న ఈ మూవీ, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఇండియా చార్ట్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుండటంతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఒక మీడియం రేంజ్ సినిమా ఇంత తక్కువ టైమ్‌లో ఓటీటీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి.

అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ మరియు సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. నరేష్, సిరి హనుమంతు, సుదర్శన్, సంపత్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు