ఓటీటీలోకి వచ్చేసిన ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

ఓటీటీలోకి వచ్చేసిన ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Published on Feb 7, 2026 8:00 AM IST

Parasakthi

తమిళ హీరో శివకార్తికేయన్ లీడ్ రోల్ లో సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘పరాశక్తి’ (Parasakthi)ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

​నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. గ్లోబల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌ను కూడా జోడించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

​డాన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో అధర్వ మురళి, రవి మోహన్ కీలక పాత్రలు పోషించగా.. రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో మెరిశారు.

తాజా వార్తలు