ఫోటో మూమెంట్: ఊహించని కలయిక.. ఒకే ఫ్రేమ్ లో దళపతి విజయ్, వై ఎస్ జగన్

ఫోటో మూమెంట్: ఊహించని కలయిక.. ఒకే ఫ్రేమ్ లో దళపతి విజయ్, వై ఎస్ జగన్

Published on Feb 9, 2026 12:00 AM IST

Thalapathy Vijay

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పిక్ అయితే దక్షిణాది సహా నేషనల్ లెవెల్లో కూడా మంచి వైరల్ గా మారుతుంది. ఏపి మాజీ సీఎం వై ఎస్ జగన్ ఇంట జరుగుతున్న ఓ శుభ కార్యానికి దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి హాజరు కావడం జరిగింది. అయితే ఈ వేడుకల్లో లేటెస్ట్ సౌత్ పొలిటికల్ స్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay)కూడా జాయిన్ అవ్వడం క్రేజీ ఫ్రేమ్ గా మారింది.

వై ఎస్ జగన్ ఎప్పటిలానే సింపుల్ లుక్ లో ఉండగా విజయ్ సూట్ ధరించి ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇక ఇద్దరూ కూడా కలిసి మాట్లాడుతూ ఉన్న ఫోటోలు అలానే యువ జంటతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులు నడుమ తెగ హల్చల్ చేస్తున్నాయి. దీనితో ఈ ఊహించని కలయిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ నటించిన జన నాయకుడు సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు