ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు/సిరీస్‌లు ఇవే..!

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు/సిరీస్‌లు ఇవే..!

Published on Feb 9, 2026 12:22 PM IST

OTT

వాలెంటైన్స్ వీక్‌లో సినిమా ప్రేమికులను ఎంటర్‌టైన్ చేసేందుకు పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మాస్ యాక్షన్ చిత్రం నుంచి హాలీవుడ్ హర్రర్ సినిమాల వరకు ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయనున్న చిత్రాల జాబితాపై ఓ లుక్కేద్దాం.

మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Vara Prasad Garu)

మెగాస్టార్ చిరంజీవి నటించిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామెడీలో నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో మెరిశారు.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జీ5
తేదీ: ఫిబ్రవరి 11, 2026

అనగనగా ఒక రాజు (Anaganaga Oka Raju)

నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లను సాధించింది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ రూరల్ కామెడీ డ్రామాను దర్శకుడు మారి తెరకెక్కించారు.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
తేదీ: ఫిబ్రవరి 11, 2026

సంప్రదాయినీ సుప్పిణి సుద్దపూసని (Sampradayini Suppini Suddapoosani)

చాలా కాలం తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన క్రైమ్ డ్రామా ఇది. చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ గ్రామీణ కథను సుధీర్ శ్రీరామ్ డైరెక్ట్ చేశారు.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: ఈటీవీ విన్
తేదీ: ఫిబ్రవరి 12, 2026

కోహ్రా సీజన్ 2 (Kohrra Season 2)

మొదటి సీజన్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు రెండో సీజన్‌తో రాబోతోంది. బరున్ సోబ్తి, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్
తేదీ: ఫిబ్రవరి 11, 2026

బేబీ గర్ల్ (Baby Girl)

మలయాళ స్టార్ నివిన్ పౌలీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘బేబీ గర్ల్’. హాస్పిటల్‌లో పసికందు మాయమైన ఘటన చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: సోనీ లివ్
తేదీ: ఫిబ్రవరి 12, 2026

ప్రిడేటర్స్: బ్యాడ్‌లాండ్స్ (Predators: Badlands)

హాలీవుడ్ పాపులర్ సైన్స్ ఫిక్షన్ సిరీస్ నుంచి వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుంది.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్
తేదీ: ఫిబ్రవరి 12, 2026

ది కంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్ (The Conjuring: Last Rites)

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘ది కంజ్యూరింగ్’ ఫ్రాంచైజీలో ఇదే చివరి భాగం. హర్రర్ ప్రియులకు ఈ వీకెండ్ భయంకరమైన వినోదాన్ని పంచేందుకు ఎడ్, లోరైన్ వారెన్ దంపతులు సిద్ధమయ్యారు.
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: జియో హాట్‌స్టార్
తేదీ: ఫిబ్రవరి 13, 2026

గోల్డ్ & గీత (Gold & Geetha)

ఈటీవీ విన్‌లో వస్తున్న ‘కథా సుధ’ సిరీస్‌లో భాగంగా ‘గోల్డ్ & గీత’ అనే షార్ట్ ఫిల్మ్ నిన్నటి నుంచే స్ట్రీమ్ అవుతోంది. అజయ్ కతువార్, దాక్షి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు