వరల్డ్ వైడ్ గా మంచి పాపులార్టీ ఉన్నటువంటి హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంచైజ్ లలో ప్రిడేటర్ సిరీస్ (Predator Badlands )కూడా ఒకటి. అయితే అప్పట్లో ఆర్నాల్డ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఒకటీ రెండు సినిమాలు తప్పితే ఈ ఫ్రాంచైజ్ లో మంచి కిక్ ఇచ్చే సినిమా మళ్ళీ రాలేదు. మధ్యలో కొన్నేళ్ల కితం వచ్చిన ‘ప్రే’ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించింది.
కానీ రీసెంట్ గా వచ్చిన ఓ సినిమా మాత్రం మళ్ళీ ఈ ‘ప్రిడేటర్’ సిరీస్ లో మంచి కిక్ తీసుకొచ్చింది. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ కి వచ్చిన ఆ చిత్రమే ‘ప్రిడేటర్: బ్యాడ్ ల్యాండ్స్’. ఈసారి ఫుల్ యాక్షన్ తో వచ్చిన ఈ సినిమా యాక్షన్ మూవీ లవర్స్ కి మంచి ట్రీట్ ని అయితే అందించింది. దర్శకుడు ట్రాచెన్ బర్గ్ తెరకెక్కించిన ఈ సినిమా సిరీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఫైనల్ గా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమాని ప్రస్తుతం జియో హాట్ స్టార్ వారు వరల్డ్ వైడ్ గా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సినిమా కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా రీజనల్ గా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి అందుబాటులో ఉంది. సో ఈ వీకెండ్ కి ఓటిటిలో మంచి హాలీవుడ్ యాక్షన్ సినిమా చూడాలి అనుకునేవారు ఈ చిత్రాన్ని చూడొచ్చు.


