ధనుష్ తో పెళ్లి వార్తలపై మృణాల్ నుంచే క్లారిటీ!

ధనుష్ తో పెళ్లి వార్తలపై మృణాల్ నుంచే క్లారిటీ!

Published on Feb 12, 2026 10:06 PM IST

Mrnual-and-Dhanush

గత కొన్ని కొన్ని రోజులు కితం వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యిపోయిన సంచలన టాపిక్స్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల కోసమే అని చెప్పాలి. మరి మృణాల్ ఠాకూర్ ఇంకా ధనుష్ లు ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు అని అది కూడా ఈ ఫిబ్రవరి 14నే అంటూ ఎన్నో ఊహాగానాలు ఓ రేంజ్ లో వైరల్ గా మారిపోయాయి.

ఇక ఈ రూమర్స్ పై లేటెస్ట్ గా స్వయంగా మృణాల్ ఠాకూర్ నుంచే క్లారిటీ వచ్చింది. అసలు ఈ పెళ్లి రూమర్స్ ఎలా ఎక్కడ నుంచి మొదలయ్యాయి అనేది కూడా తెలీదు అని అవన్నీ పచ్చి అబద్దం అని ఆమె కొట్టి పారేసింది. అంతే కాకుండా ఈ ఫిబ్రవరి 14న ఎవరైతే తమ పెళ్లి అంటూ నమ్మారో అది వాళ్ళకి వాలెంటైన్స్ డే 14 కాదు ఏప్రిల్ 1 లాంటిది అని అలా నమ్మేసిన వారు అంతా ఫూల్స్ అవుతారు అంటూ అసలు విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో ధనుష్ కి ఆమెకి పెళ్లి అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు