నేచురల్ స్టార్ తో వెంకీ అట్లూరి మూవీ.. సెట్ అయ్యేనా..?

నేచురల్ స్టార్ తో వెంకీ అట్లూరి మూవీ.. సెట్ అయ్యేనా..?

Published on Feb 13, 2026 11:00 AM IST

venky

దర్శకుడు వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఘనవిజయం సాధించింది. దీనితో వెంకీ అట్లూరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ సూర్యతో ‘సూర్య 46’ అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఇది వయసులో చాలా వ్యత్యాసం ఉన్న ఒక జంట మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథగా రూపొందుతోంది.

సూర్య సినిమా తర్వాత వెంకీ అట్లూరి నేచురల్ స్టార్ నానితో పనిచేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్‌లో తలమునకలై ఉన్నారు. అయితే, ఈ సినిమా నిర్మాణం అనుకున్న దానికంటే కొంత ఆలస్యమవుతోంది. ఈ గ్యాప్‌లోనే వెంకీ అట్లూరి తన తదుపరి కథను నానికి వినిపించినట్లు, దానికి నాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

నాని ఇప్పటికే ‘సాహో’ ఫేమ్ సుజీత్‌తో ఒక భారీ యాక్షన్ చిత్రాన్ని లైన్‌లో పెట్టారు. ఒకవేళ వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నాని ఏ సినిమాను ముందుగా పూర్తి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సుజీత్ మరియు వెంకీ సినిమాలను ఒకేసారి చేస్తారా లేక ఒకదాని తర్వాత ఒకటి చేస్తారా అన్నది వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు