మెగా వారసుల నామకరణం చేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

మెగా వారసుల నామకరణం చేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Published on Feb 13, 2026 12:00 PM IST

chiru

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు (బాబు మరియు పాప) జన్మనివ్వడం తో మెగా అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ శుభకార్యం తో మెగా కుటుంబంలో సరికొత్త వెలుగులు నిండాయి. తాజాగా ఈ చిన్నారుల బారసాల వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ జంట, తమ పిల్లలకు పెట్టిన అర్థవంతమైన పేర్లు అధికారికంగా వెల్లడించారు.

వారసుడికి ‘శివ్‌రామ్’ అని నామకరణం చేశారు. ఈ పేరు సాక్షాత్తు ఆ పరమశివుడు మరియు శ్రీరాముడి పేర్ల కలయికగా రూపొందింది. ఇది అపారమైన శక్తిని, భక్తిని మరియు ధర్మాన్ని సూచిస్తుంది. ఇక పాపకు ‘అన్వీర దేవి’ అనే పేరును ఖరారు చేశారు. ధైర్యం మరియు దైవిక శక్తి కలిగిన పేరుగా ఇది అభిమానుల మనసు గెలుచుకుంటుంది.

రామ్ చరణ్ దంపతులకు ఇప్పటికే ‘క్లిన్ కారా కొణిదెల’ అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. లలితా సహస్రనామాల నుండి స్ఫూర్తి పొంది ఆ పేరును నిర్ణయించారు. ఇప్పుడు కవలలకు కూడా ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విలువలు ఉట్టిపడేలా పేర్లు పెట్టడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు