సమీక్ష: ‘చథా పచ్చ’ – కేవలం యాక్షన్ మాత్రమే

సమీక్ష: ‘చథా పచ్చ’ – కేవలం యాక్షన్ మాత్రమే

Published on Feb 13, 2026 10:29 PM IST

chatha-pacha-movie

విడుదల తేదీ : ఫిబ్రవరి 13, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : అర్జున్ అశోకన్, ఇషాన్ షౌకత్, రోషన్, మమ్ముట్టి తదితరులు
దర్శకత్వం : అద్వైత్ నాయర్
నిర్మాణం : షిహన్ షౌకత్, రితేష్ ఎస్, రామకృష్ణన్
సంగీతం : శంకర్ – ఇషాన్ – లాయ్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ : ముజీబ్ మజీద్
సినిమాటోగ్రఫీ : ఆనంద్ సి చంద్రన్
ఎడిటింగ్ : ప్రవీణ్ ప్రభాకర్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మలయాళ హిట్ చిత్రం చథా పచ్చ కూడా ఒకటి. తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ వారు తీసుకొచ్చిన ఈ యాక్షన్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ముగ్గురు అన్నతమ్ములు సవి (అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్) అలాగే వెట్రి (రోషన్) తమ చిన్న నాటి నుంచే తమ ఊర్లో అలాగే టీవీలో వచ్చే రెజ్లింగ్, కుస్తీ పోటీలు లాంటివి చూసి బాగా ప్రేరణ చెందుతారు. కానీ కొన్ని కారణాలు రీత్యా వేరైన ఈ ముగ్గురులో లిటిల్ ఢిల్లీ నుంచి మళ్లీ కొచ్చిన్ తిరిగొచ్చి లైఫ్ లో ఇంకా ఏదైనా సాధించాలి అని కాస్ట్యూమ్ రెజ్లింగ్ అంటూ అక్కడే తమ లోకల్ స్నేహితులు సవిలు కలిసి స్టార్ట్ చేయాలని చూస్తారు. ఈ క్రమంలో వెట్రి ఎందుకు వీరితో లేడు. వీరు సెపరేట్ గా స్టార్ట్ చేసుకున్న ఈ రెజ్లింగ్ పోటీ హిట్టయ్యిందా లేదా? ఇందులో వీరికి ఎదురైన సవాళ్లు ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ప్రస్తుతం ఈ డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ రెజ్లింగ్, కుస్తీ పోటీలు లాంటివి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది చిన్నతనంలోనే వీటి ప్రభావం కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ లోనో లేక ముగ్గురు అన్నతమ్ములు మధ్యనో ఫైటింగ్ లాంటివి చేసుకుంటారు. అలాంటి ఓ ముగ్గురు అన్నతమ్ములు కలిసి స్టార్ట్ చేసిన రియల్ లైఫ్ రెజ్లింగ్ లో ఫైట్ సీక్వెన్స్ లు మాత్రం ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి.

వీటిలో యాక్షన్ బ్లాక్ లు ఆ మూడ్ అండ్ మూమెంటం ని మైంటైన్ చేస్తూ మ్యూజిక్ లు మంచి ఎఫెక్ట్ చూపించాయి.
ఒక ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లాంటి సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ ఓ రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది. ఇక ఇందులో నటించిన తారాగణం అంతా కూడా సాలిడ్ వర్క్ అందించారు.

ఏ అంచనాలు లేకుండా చూసేవారికి అంతా ముందు చాలా సాధారణంగానే కనిపిస్తారు కానీ వారి నుంచి ఒక్కసారిగా యాక్షన్ మొదలయ్యాక మాత్రం అంతా అసాధారణ రీతిలో కనిపిస్తారు. అర్జున్ అశోకన్, రోషన్ అలాగే ఇషాన్ షౌకత్ లు తమ పాత్రల్లో పర్ఫెక్ట్ గా ఇమిడిపోయారు. వారు చేసే యాక్షన్, స్టంట్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తాయి.

వీరితో పాటుగా వీరి గ్యాంగ్ నటులు వీరి పాత్రలు తీర్చిదిద్దిన విధానం ఇందులో మెప్పిస్తుంది. అలానే క్లైమాక్స్ లో మమ్ముట్టి కామియో కూడా ఇందులో బాగా వర్కవుట్ అయ్యింది. ఇక ఈ అన్నింటితో పాటుగా మ్యూజిక్, కెమెరా వర్క్, యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రంలో బిగ్గెస్ట్ ఎసెట్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో సాలిడ్ యాక్షన్ ఉంది కానీ బలైమైన ప్లాట్ లైన్ ఇందులో కనిపించదు. ఎంత రెజ్లింగ్ పిచ్చి ఉన్నా ఇందులో చూపించే కథాంశం ఒకింత రియాలిటీకి దూరంగానే వుంటుంది. అంతే కాకుండా ఫస్టాఫ్ సెకండాఫ్ లో కథనాలు మొదటి కొన్ని నిమిషాలు పాటు చాలా రొటీన్ అండ్ చప్పగా సాగుతాయి. వీటితో సినిమా ఒకింత బోర్ కొడుతుంది.

యాక్షన్ లవర్స్ అయితే ఆ రెజ్లింగ్ పోటీ సీన్స్ ఏదో త్వరగా స్టార్ట్ చేస్తే బాగుండు అనేలా ఫీల్ అవుతారు. ఇందులో ముందు రెజ్లింగ్ తోనే పోటీ స్టార్ట్ చేస్తారు కానీ ఇది కాస్తా హాలీవుడ్ స్టైల్ యాక్షన్ లోకి మారిపోయింది. ఇక్కడ లాజిక్ మర్చిపోవాలి. అలానే మంచి ఎమోషన్స్, లేదా ఫుల్ కామెడీ లాంటి అంశాలు ఇందులో కోరుకున్నా కొంచెం డిజప్పాయింట్ అవుతారు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఒక ప్యాకెడ్ యాక్షన్ డ్రామాకి కావాల్సిన సెటప్ ని మొత్తం అన్ని కోణాల్లో సెట్ చేసుకున్నారు. మొదటిగా కలై కింగ్సన్ యాక్షన్ కొరియోగ్రఫీనే ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. తను డిజైన్ చేసిన యాక్షన్ పార్ట్ అంతా బాగా వర్కౌట్ అయ్యింది. వీటికి తోడు ముజీబ్ మజీద్ ఇచ్చిన స్కోర్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. ఆనంద్ సి చంద్రన్ ఇచ్చిన కెమెరా వర్క్ కూడా ఇందులో చాలా బాగుంది. ప్రవీణ్ ప్రభాకరన్ ఎడిటింగ్ డీసెంట్ అని చెప్పొచ్చు.

ఇక దర్శకుడు అద్వైత్ నాయర్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి పర్వాలేదు. మరీ బలమైన ప్లాట్ ని సెట్ చేసుకోలేదు కానీ ఇందులో యాక్షన్ పార్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని మాస్ మూమెంట్స్ అలాగే ఫైట్ ఎపిసోడ్స్ ని బాగా ప్లాన్ చేసుకున్నారు కానీ మిగతా కథలో కూడా డెప్త్ మైంటైన్ చేసి ఉంటే బాగుండేది. ఇవి మినహా తన వర్క్ ఈ సినిమాకి ఓకే అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ కేవలం యాక్షన్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే సినిమా అని చెప్పొచ్చు. నటీనటులు అంతా చాలా బాగా చేశారు. మ్యూజిక్ కూడా వర్క్ అవుతుంది. పెద్దగా బలమైన కథతో మాకు పని లేదు మంచి ఫైట్స్, మంచి మ్యూజిక్ తో కావాలి అనుకునేవారికి ఈ చిత్రం.  మిగతా ఆడియెన్స్ ఈ సినిమాని అవాయిడ్ చేసేయొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు