ఓటిటిలోకి వచ్చినా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నైజాంలో భారీ రికార్డు!

ఓటిటిలోకి వచ్చినా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నైజాంలో భారీ రికార్డు!

Published on Feb 14, 2026 5:02 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో భారీ గ్రాసర్ గానే కాకుండా రీజనల్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే థియేటర్స్ లో రన్ దాదాపు పూర్తి కావచ్చిన సమయంలో ఓటిటిలో రిలీజ్ కి ఇటీవల వచ్చింది. జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా భారీ రెస్పాన్స్ ని అక్కడా కొల్లగొట్టింది. అయితే ఓటిటిలోకి వచ్చినప్పటికీ నైజాం మార్కెట్ లో భారీ ఫీట్ ని సెట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. నైజాంలో 50 కోట్ల షేర్ ని రాబట్టిందట. ఇది మాత్రం సెన్సేషనల్ ఫీట్ అని చెప్పాల్సిందే.

మరి ఈ జెనరేషన్ లో కూడా మెగాస్టార్ నుంచి ఈ రేంజ్ బ్యాటింగ్ అంటే తనకి కరెక్ట్ సినిమా పడితే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా సాలిడ్ క్యామియోలో నటించగా భీమ్స్ సంగీతం అందించారు.అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు