యువతను ఆకట్టుకునే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వాట్స్ అప్ నరేష్’. ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్‌రామ్, ‘కొత్తపోరడు’ ఫేమ్ అన్వేష్ మైఖేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి వాలెంటైన్స్ డే కానుకగా రెండో గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
సివివి సినిమా బ్యానర్‌పై భాగ్యలక్ష్మీ చింత నిర్మిస్తున్న ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో హీరో, హీరోయిన్ల మధ్య డేటింగ్, కులం తదితర అంశాల గురించి సాగే ఫన్నీ సంభాషణలు ఆద్యంతం వినోదభరితంగా ఉన్నాయి. అలాగే, ఈ వీడియోలో నేపథ్యంగా వినిపించిన “అయోమయంగా సాగుతున్న పయనమే ఇదా” అనే పాట ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి స్పందన రాగా, ఈ తాజా వీడియో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం సమకూర్చుతుండగా, వేదరామన్ శంకరన్ ఛాయాగ్రాహకుడిగా, విప్లవ్ నైషదం ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు మేకర్స్ తెలిపారు.


