‘తుంబాడ్ 2’ లో విలన్ గా పవర్ఫుల్ నటులు పేర్లు?

‘తుంబాడ్ 2’ లో విలన్ గా పవర్ఫుల్ నటులు పేర్లు?

Published on Feb 17, 2026 10:59 PM IST

Tumbbad 2

ఇండియన్ సినిమా దగ్గర వచ్చినటువంటి ఆల్ టైం బెస్ట్ హారర్ ఫాంటసీ చిత్రాల్లో డెఫినెట్ గా ముందు వరుసలో వచ్చే చిత్రమే “తుంబాడ్”. దర్శకుడు అనీల్ రాహి బర్వె తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. దీనిపై పాన్ ఇండియా లెవెల్లో మంచి హైప్ కూడా ఉంది.

అయితే పార్ట్ 1 లో కనిపించిన నటుడు సోహమ్ షా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం పవర్ఫుల్ టాలెంటెడ్ నటులు పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్ సహా తన నటనతో పాన్ ఇండియా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తున్న నటుడు రీసెంట్ ధురంధర్ సెన్సేషన్ అక్షయే ఖన్నా అలాగే మరో టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖ్కీల పేర్లు ఈ సినిమాలో విలన్ రోల్స్ కోసం వినిపిస్తున్నట్టు తెలుస్తుంది.

నవాజుద్దీన్ అయితే వెంకీ మామ ‘సై౦ధవ్’ చిత్రంలో ఏ రేంజ్ పెర్ఫామెన్స్ చూపించారో తెలిసిందే. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా సరే అలాంటి మ్యాడ్ సీక్వెల్ లో అంటే డెఫినెట్ గా వర్త్ అనే చెప్పొచ్చు. మరి దీనిపై మరింత క్లారిటీ బయటకి రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం పనులు నిదానంగానే కొనసాగుతున్నాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు